శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు
భక్తులు ఏకస్వరంతో హనుమాన్ చాలీసా పారాయణం
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం శనివారం 119వ వారానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో దిగ్విజయంగా కొనసాగింది. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులు ఏకస్వరంతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. గతంలో ఈ పారాయణం 116వ వారానికి చేరినట్లు నమోదై, ప్రస్తుతం 119వ వారానికి చేరుకుంది.
పారాయణం అనంతరం దేశంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా జీవించాలని భక్తులు శ్రీ ఆంజనేయస్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో పారాయణాన్ని విజయవంతం చేశారు. నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరింత మంది భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు
