రేపు కొత్తగూడెం రానున్న తన్నీరు హరీష్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : సింగరేణి పరిరక్షణ పేరుతో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 23 వ తేదీన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శాసనసభ పక్ష ఉప నేత హరీష్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ పార్టీ అనుబంధ యూనియన్ టీబీజీకెఎస్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి సంస్థను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది అంటూ గులాబీ పార్టీ సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో సంస్థ విస్తరించిన ఆరు జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా సింగరేణి హెడ్ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పాల్గొనాలని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు…
