4-family-suicide : అంతులేని.. కష్టం Andhra Prabha Sad News
4-family-suicide : అంతులేని.. కష్టం Andhra Prabha Sad News
- భార్యాబిడ్డలతో సహా…
- ఓ ఆత్మాభిమాని ఆత్మహత్య
- చిత్తూరు జిల్లాలో కలచిన విషాదం
( ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో)
తన ఇల్లాలికి బ్రెయిన్ స్ట్రోక్. తాను మధ్య తరగతి జీవి. కళ్లముందే తన అర్ధాంగి బాధను చూడలేక పోయాడు. వైద్యానికి అప్పులు చేశాడు. ఆరోగ్యం కుదుట పడలేదు. అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. ఇటు రుణదాతలను వదిలించుకోలేడు. ఇటు తన భార్య లేకుండా బతకలేదు. మరో వైపు తమ పేగుబంధాన్ని అనాథ చేయలేక.. ఆ వ్యక్తి పడిన బాధ వర్ణనాతీతం. కనీసం సీఎంఆర్ఎఫ్ నిధులు ఇప్పించే నాయకుల సాయమూ లేదు. ఈ స్థితిలో.. భార్య బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న ఈ వ్యక్తి.. తమ దహన సంస్కారాలకు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయటానికి పిన్ నెంబరు కూడా ప్రకటించాడు. అతని ఆత్మాభిమానం.. బలవన్మరణానికి దారి తీయటానికి కారణం తెలిస్తే.. సభ్య సమాజం కన్నీరు పెట్టక తప్పదు.
4-family-suicide : అసలేం జరిగింది?
ఒక పక్క కుటుంబ సమస్య మరో పక్క ఆర్థిక సమస్య పట్టి పీడిస్తున్న నేపథ్యంలో భార్య పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించాడు. చనిపోయిన తర్వాత తాను ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఆఖరి వ్యథ కథ చిత్తూరు రూరల్ మండలంలో కలకలం రేపింది.
4-family-suicide : ఆ గుండెల్లో వ్యథ ఇదే
ఇక వివరాల్లోకి వెళ్తే పలమనేరు మండలం మాడిపేట కోటూరుకు చెందిన సుమారు 33 ఏళ్ల దామోదర్ అనే వ్యక్తికి నిర్మల అనే మహిళకు వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి 13 సంవత్సరాల వయసు కలిగిన ఎనిమిదవ తరగతి
చదువుతున్న దిలీప్ కుమార్ 10 సంవత్సరాల వయసు కలిగిన ఆరవ తరగతి చదువుతున్న శ్రీవిద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాడిపేట కోటూరు నుండి 10 సంవత్సరాల క్రితం చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లిలో వచ్చి స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెకు గత కొంతకాలంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాణీపేట సిఎంసిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె వైద్యానికి అతను ఎక్కువగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక పక్క ఆర్థిక భారం మరో పక్క కుటుంబ సమస్య ఆమెకు నయం కానీ సుదీర్ఘకాల అనారోగ్య సమస్య ఇలా అతని పట్టి పీడిస్తూ ఉన్న నేపథ్యంలో
4-family-suicide : ఆఖరి కబుర్లు ఇవే
ఆదివారం రాత్రి భార్యా భర్తలు ఇద్దరూ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భార్య పిల్లలకు అతను అన్నంలో విషం కలిపించారు. వారు చనిపోయిన తర్వాత ఒక వైట్ పేపర్ లో తన ఫోన్ పే నెంబరు దాని పాస్వర్డ్ ను అదేవిధంగా తన ఏటీఎం కార్డ్ నెంబర్ ను దాని పాస్వర్డ్ ను రాసి కుటుంబ దహనక్రియలకు ఆ డబ్బును వినియోగించవలసిందిగా అందులో రాసి టీవీ కి అతికించి అనంతరం అతను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
4-family-suicide : బంధువుల రోదన
అతని అక్క చిన్న భర్త గోపి సోమవారం ఉదయం సుమారు 6గ:45 నిమిషాల ప్రాంతంలో వచ్చి ఇంటి తలుపులు తట్టగా తెరవకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులతో చేరి తలుపులు పగలగొట్టి లోపల వెలిగి చూడ అందరూ కూడా విగత జీవులై ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్ఆర్పేట పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం ఈ ఘటన పైన మరిన్ని వివరాలు పోలీసుల ధర్యాప్తులో తెలియాల్సి ఉంది
