వీవోఏల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

వీవోఏల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

  • మండల అధ్యక్షురాలు పార్వతి

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: సంస్థాన్ నారాయణపురం మండల వీవోఏల మండల కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలుగా బైకని పార్వతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… వీవోఏల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని అన్నారు. కార్యదర్శిగా మిరియాల జయశ్రీ, కోశాధికారి ఆంగోతు ప్రేమలత, ఉపాధ్యక్షుడు వీరమల్ల రమేష్, సహాయ కార్యదర్శి కృష్ణ, గౌరవ అధ్యక్షురాలు నాగమణిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల వివో ఏలు నూతన కమిటీని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కట్టెల చంద్రయ్య, ఎర్రోళ్ల గాలయ్య, గిరి, పద్మ, దేవి, సరిత, శిల్ప, అనూష, సుధారాణి, దాస్య, పారిజాత, లింగస్వామి, అరుణ పాల్గొన్నారు.

Leave a Reply