కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని వినతి..
ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేసిన సామాజిక కార్యకర్త ఆకుల శ్రీనివాసకుమార్
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని 37 వ డివిజన్, పెజ్జోనిపేట లో నిరుపయోగంగా ఉన్న సుమారు 5000 గజాల స్థలంలో ప్రజలకు ఉపయోగకరమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రముఖ సామాజిక వేత్త ఆకుల శ్రీనివాసకుమార్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెజ్జోనిపేటలో ఆకుల శ్రీనివాసకుమార్ శనివారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

2007 వ సంవత్సరం వరకు తమిళ పాఠశాల తమిళవాసుల నివాసాలు దేవాలయం ఉండేదని.. కాల క్రమేణ ఈ ప్రాంతం నిరుపయోగమై అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. పాఠశాల ఉన్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.. అదేవిధంగా బి.ఆర్.టి.ఎస్ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ వైపుకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కు ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్యే సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు.
