కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న అవనిగడ్డ గ్రౌండ్

కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న అవనిగడ్డ గ్రౌండ్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ:
ఈ నెల 24, 26 తేదీల్లో జరిగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల-హైస్కూల్ క్రీడా మైదానం సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ, స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ఈ కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాట్లను నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ గురువారం పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైస్కూల్ క్రీడా మైదానంలో గ్రామీణ యువజన వికాస సమితి, గాంధీ క్షేత్రం ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల సూచనలకు అనుగుణంగా ఆట స్థలం సిద్ధం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జీ.ఎన్.బీ.గోపాల్, పీఈటీల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సింహాద్రి గంగాధర్, నియోజకవర్గ కార్యదర్శి బండే పాండు లింగప్రసాద్, ట్రెజరర్ తోట నవీన్, విశ్రాంత పీఈటీ పూర్ణచంద్రరావు, సింహాద్రి పవన్, గుడివాక నరహరి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
