కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలు విక్రయించాలి…

కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలు విక్రయించాలి…

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలు విక్రయించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పేర్కొన్నారు. పిఎసిఎస్ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

ప్రభుత్వం మక్కలకు క్వింటాల్ కు రూ.2400 మద్దతు ధర అందిస్తుందని, 14 శాతం తేమతో మొక్కజొన్నలను కేంద్రాలకు తీసుకువచ్చి వారం రోజుల్లో డబ్బులు పొందాలని కోరారు. కేంద్రానికి మొక్కజొన్నలు తీసుకువచ్చే రైతులు పంట సాగు ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ లు వెంట తీసుకురావాలని సూచించారు.

కేంద్రం నుంచి మద్దతు లేకపోయినప్పటికీ, రైతులకు సరసమైన ధరలు అందేలా చూస్తూ, రూ. 2,500 కోట్ల విలువైన మొక్కజొన్నను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుగులోత్ భట్టు నాయక్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కాంగ్రెస్ మహిళా బ్లాక్ అధ్యక్షురాలు పింగిలి ఉష, డైరెక్టర్లు,ఏవో రామనర్సయ్య,
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply