కడెంలో టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కడెం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దుర్గ భవాని, ఆర్టీఏ సభ్యుడు మల్లేష్, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంట్ అధ్యక్షుడు కమలాకర్, టౌన్ ప్రెసిడెంట్ వాజీద్ పాల్గొన్నారు.

అలాగే సర్పంచులు తాటి రుక్మిణి దేవి, సంజీవ్, రమేష్, సుమలత నరేష్, తాళ్లపల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు దూల్లే వెంకటేష్, దుర్గం రాజేష్, చిన్నయ్య, బబ్లు, తొట్ల గంగాధర్, ఎండి షర్ఫుద్దీన్, చంద్రశేఖర్, చిట్యాల చిన్నయ్య, ధర్మయ్య, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply