విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో బుధవారం విద్యుత్ షాక్ తో పాడి గేదే మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం తొర్రూరు పట్టణం 5వ వార్డులోని దుబ్బ తండకు చెందిన ధారావత్ వెంకన్నకు మహబూబాబాద్ రోడ్ లో ఉన్న వ్యవసాయ భూమిలో పాడి గేదే మేత మేస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి ఉండడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి పాడి గేదే అక్కడికక్కడే మృతి చెందింది.ఈ విద్యుత్ ప్రమాదం వల్ల సుమారు రూ.1 లక్ష 30 వేలు నష్టం జరిగిందని బాధిత రైతు వెంకన్న వాపోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ నష్టం జరిగిందని స్థానికులు వాపోయారు.