జయపురం హాజ్రత్ బాబా ఉత్సవాల ముగింపు
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: మండలంలోని జయపురం గ్రామంలోని హాజ్రత్ బాబా సాహెబ్ దర్గా షరీఫ్ ఆశిర్ఖానా కమిటీ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా సందర్బంగా కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం గ్రామాల్లో పీరీలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.మండల కేంద్రంలో పీరీలను డప్పు చప్పుల్లా నడుమ ఊరేగించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ రమేష్ బాబు,వైస్ ప్రెసిడెంట్ గౌస్ ఇమ్రాన్,జనరల్ సెక్రటరీ రవీందర్,జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ నజీర్ పాషా, ట్రెజరరీ అశోక్ బాబు,సభ్యులు శివరాత్రి సతీష్,శ్యాంసుందర్, చుక్క యాకుబ్,మందుల యాకన్న,మందుల రామచంద్రు, రియాజ్ పాషా,మస్తాన్ తదితరులు ఉన్నారు.
