Development | గ్రామాభివృద్ధి కోసం.. అవకాశం ఇవ్వండి..

Development | గ్రామాభివృద్ధి కోసం.. అవకాశం ఇవ్వండి..

Development | ధర్మపురి, ఆంధ్రప్రభ : నేరెళ్ల గ్రామ అభివృద్ధి కోసం తనకు అవకాశం కల్పించి సర్పంచ్ గా గెలిపించాలని నేరెళ్ల సర్పంచ్ అభ్యర్థి జజాల రమేష్(Jajala Ramesh) ఓటర్లను కోరారు. ఇవాళ‌ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

గతంలో రెండుసార్లు ఓటమిపాలయ్యారని, అయినా ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి సేవ చేశానని గుర్తు చేశారు. ఒడినా, గెలిచినా మీ మధ్యనే ఉంటానని ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. విద్యావంతుడు సర్పంచ్ గా ఉంటే గ్రామం అభివృద్ధి(Development) చెందుతుందని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.