భద్రకాళి మాత సేవలో తొర్రూరు మహిళలు

శాఖంబరి ఉత్సవాల్లో భక్తులకు సేవలు.. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థన

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి దేవాలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న శాఖంబరి ఉత్సవాల్లో భక్తులకు సేవలు అందించేందుకు తొర్రూరు నుంచి మహిళలు బుధవారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు.

ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మహిళలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.

ఈ సేవా కార్యక్రమంలో తమ్మి కరుణ, ఇమ్మడి గీతారాణి, బిజ్జాల రాధిక, చిదిరాల లక్ష్మీ సంతోషి, రాచకొండ సబిత, చీదర కళ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సేవా బృంద నిర్వాహకురాలు తమ్మి కరుణ మాట్లాడుతూ తమ బృందం గత కొన్ని నెలలుగా వివిధ దేవాలయాల్లో భక్తులకు సేవలు అందించేందుకు బృందాలుగా వెళ్తోందన్నారు. సేవ చేసే అవకాశం కల్పిస్తున్న వివిధ ఆలయాల సేవా బృంద నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

భక్తులకు సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు.