కొడిమ్యాలలో టీజేఎఫ్ రజతోత్సవాల ముగింపు వేడుకలు

కొడిమ్యాలలో టీజేఎఫ్ రజతోత్సవాల ముగింపు వేడుకలు
కొడిమ్యాల, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జర్నలిస్టులు నివాళులర్పించారు. టీజేఎఫ్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీజేఎఫ్ పోషించిన పాత్రను, ఉద్యమ జర్నలిస్టుల సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టు వీరులకు, అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.తెలంగాణ ఉద్యమ వారసత్వంతో ఏర్పడి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సేవలను పలువురు కొనియాడారు.
కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్, మండల అధ్యక్షుడు చొక్కాల మహిపాల్, దీకొండ శేఖర్, బోగా సూర్యతేజ, మొగిలిపాలెం శ్రీనివాస్, పులి వెంకటేష్, కొత్తూరి స్వామి, కోలాపురం రమేశ్, గంగయ్య, అజీజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని పాల్గొన్న సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.
