మోత్కూర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కార్యాలయంలోని సీడీ ఫైళ్లు, స్టేషన్ రికార్డులను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ భవనం, ప్రాంగణం, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, నిర్వహణ, రికార్డుల సక్రమ నిర్వహణకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లుకు సూచించారు. ఈ తనిఖీలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సతీష్ కుమార్, ఏఎస్ఐ వెంకన్నతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
