ఘనంగా రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుడు, ధూమ్ ధామ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రెండుసార్లు మానకొండూర్ ఎమ్మెల్యేగా సేవలందించిన రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బి.ఆర్.ఎస్. మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రసమయి బాలకిషన్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ, “తొలిపొద్దు” కార్యక్రమం ద్వారా ప్రజలతో నిత్యం మమేకమై ఉంటారని తెలిపారు.

ఆయన రాజకీయ ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి బాలకిషన్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని సేవలు అందించాలని, ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.