కేటీఆర్‌తో సింగపూర్ తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ భేటీ

కేటీఆర్‌తో సింగపూర్ తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ భేటీ

కొడిమ్యాల మండలం, ఆంధ్రప్రభ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మలేషియాకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ను సింగపూర్‌లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు ప్రత్యేకంగా మలేషియాకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసుల పాత్ర, పెట్టుబడుల అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు, తెలంగాణ భవిష్యత్ ప్రగతిపై కేటీఆర్‌తో చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో తెలంగాణ కల్చర్ సొసైటీ సింగపూర్ (TCSS) ప్రతినిధులు, సభ్యులు మరియు సింగపూర్‌లోని తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన వారిలో గడప రమేష్ (TCSS అధ్యక్షుడు), నల్ల భాస్కర్ (ఉపాధ్యక్షుడు), రమణ (కోశాధికారి), రాజు, చల్లా కృష్ణ, రంజిత్ రావు, విక్రమ్ చిట్లా, ఐటీ విజయ్, ప్రసాద్, అనసూరి రవి, బైరి రవి తదితరులు ఉన్నారు. సుమారు 30 మంది ఎన్నారైలు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ అందించిన నాయకత్వాన్ని వారు కొనియాడుతూ, విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ భేటీ తెలంగాణ పట్ల ఎన్నారైల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Leave a Reply