త్వరితగతిన ధాన్యం కొనుగోలు, చెల్లింపులు

త్వరితగతిన ధాన్యం కొనుగోలు, చెల్లింపులు

  • ప్రభుత్వ విప్ విజయ రమణారావు.

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి బ్రాహ్మణపల్లి, రాగినేడు, కుర్మమపల్లి, అందుగులపల్లి, దేవునిపల్లి, రంగాపూర్, గౌరెడ్డిపేట, ముత్తారం, హనుమంతునిపేట, రాంపెల్లి, చీకురాయి గ్రామాల్లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల ధాన్యాన్ని చివరిగింజ వరకు ఎలాంటి కటింగ్ లేకుండా కొంటామని హామీ ఇచ్చారు. కొన్న ధాన్యానికి త్వరితగతిన డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం పూర్తి చర్యలు చేపట్టినట్లు వివరించారు. గన్ని సంచులు కేంద్రాల్లో సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విండో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply