బాధిత కుటుంబానికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ అందజేత..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గొల్లపల్లి లత హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్పందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లత ఆపరేషన్ కోసం రూ.4 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)ను ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. వైద్యులతో మాట్లాడి లతకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడెం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
