NEWS@10:00 A.M | 16 జూలై 2026 ముఖ్యాంశాలు

మన బియ్యానికి విదేశాల్లో భారీ డిమాండ్.. అమాంతంగా పెరిగిన బియ్యం ధరలు

అమరావతి, ఆంధ్రప్రభ: మార్కెట్లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ఎల్నినో ప్రభావం స్పష్టంగా బియ్యంపై కనిపిస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలో క్వాలిటీ రైస్ కిలోకు రూ.10 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే, ఎల్నినో ప్రభావంతో ఈసారి వరి సాగు తగ్గి దిగుబడి కూడా పడిపోతే రేట్లు మరింత పెరుగుతాయేమో అన్న భయం ప్రజల్లో నెలకొంది.

కాంగ్రెస్ కంచుకోటను ఛేదించేందుకు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణను రెండు భాగాలుగా విభజించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో వ్యూహాత్మకంగా బలపడితేనే భవిష్యత్‌లో అధికార కాంగ్రెస్‌ను ఢీకొట్టగలమనే అంచనాతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే తరహా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి.

జగన్నాథుని సాన్నిధ్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆత్మీయ అనుభూతులు

శ్రీ జగన్నాథునికి అంకితమైన ఎన్నో ప్రార్థనలు, కీర్తనలు బాల్యం నుంచే నా జ్ఞాపకాలలో నిలిచిపోయాయి. పాఠశాల, కళాశాలలో చదువుతున్న రోజుల్లో మహాప్రభు జగన్నాథుని కీర్తిస్తూ భక్తితో పాటలు ఆలపిస్తూ ఆనందాన్ని పొందేదాన్ని. ఆ జగన్నాథునికి చాలా సన్నిహితంగా ఉన్నాననే భావన కలిగేది. ప్రస్తుతం ఆ కీర్తనలను పాడలేకపోయినా, నిత్యం జగన్నాథుని స్మరిస్తూ ఆయన సాన్నిధ్యాన్ని ప్రతి క్షణం అనుభూతి చెందుతుంటాను. కష్ట సమయాల్లో ఆయన నాకు అండగా నిలిచారని నా విశ్వాసం.

వారాహి దేవి అవతార విశేషం.. సప్తమాతృకల్లో విశిష్ట స్థానం

ఆషాఢమాసం ఈ నెల 15వ తేదీ ప్రారంభమైన ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులను నవమి వరకు నిర్వహిస్తారు. పదో రోజున అమ్మవారిని శాకాంబరీ మాతగా అలంకరించి ప్రార్థిస్తారు. ఈ నవరాత్రులు ఉత్తరాది రాష్ట్రాల్లో నవదుర్గ పూజల రూపంలో నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొద్ది దేవాలయాల్లో, వారాహి దేవి విశిష్టత తెలిసిన భక్తులు ఈ నవరాత్రులను ఆచరిస్తున్నారు.

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలతో వినియోగదారులకు ఊరట

భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో క్రాస్ సెల్లింగ్ ఒకటి. రుణాలు, డిపాజిట్లు వంటి సంప్రదాయ బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక ఉత్పత్తులను విక్రయించేందుకు బ్యాంకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది ఒక్క ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఎక్కువగా జరుగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులపై భారీ లక్ష్యాలు విధించడం, వినియోగదారులపై పరోక్ష ఒత్తిళ్లు, కొన్ని సందర్భాల్లో మిస్ సెల్లింగ్ ఆరోపణలు రావడం సాధారణమైంది.

argentina-beat-england-2-1.. మెస్పీ గ్యాంగ్ మెర్సిలెస్ ..

 అంద‌రూ ఊహించిన‌ట్టే ఫిఫా టోర్నీ డిఫం డింగ్​ చాంపియన్​ అర్జెంటీనా ఫైన‌ల్ కు దూసుకు పోయింది. ఆఖ‌రి నిముషంలో ఇంగ్లండు జ‌ట్టు ఆశ‌ల్ని మెస్పీ గ్యాంగ్ నిర్ధాక్ష‌ణ్యంగా ఓడించింది. ఒకానొక ద‌శ‌లో అర్జెంటీనా.. ఈ మ్యాచ్‌లో ఓడ‌టం ఖాయం అని సాక‌ర్ వీరులు టెన్ష‌న్ ప‌డ్డారు. కానీ ఆఖ‌రి అద‌న‌పు నిముషంలో 2-1 తేడాతో ఇంగ్లాండుకు జెల్ల‌కొట్టింది. అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి అర్థ భాగంలో ఇంగ్లండ్ టీమ్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ఒక వైపు అర్జెండీనా కాళ్ల‌కు క‌ళ్లెం వేస్తూ.. మ‌రో వైపు గోల్ పోస్టు వైపు బంతిని త‌ర‌లించారు.

Click here to read full stories