భూగర్భ గనిలోకి దిగిన కవిత.. కార్మికుల భద్రత, సంక్షేమంపై ఆరా

భూగర్భ గనిలోకి దిగిన కవిత.. కార్మికుల భద్రత, సంక్షేమంపై ఆరా

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి పీవీకే-5 భూగర్భ గనిని సందర్శించారు. గనిలోకి స్వయంగా దిగిన ఆమె బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గనిలో పనిచేస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడిన కవిత, వారి పని పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, సంక్షేమ సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా విని, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

గనిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కవిత, కార్మికుల శ్రమను అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు, సంక్షేమం, భద్రత విషయంలో అవసరమైన అంశాలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కవిత పర్యటన సందర్భంగా సింగరేణి అధికారులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.