netflix | ఓటీటీలో డబుల్ ఎంటర్టైన్మెంట్
netflix | ఓటీటీలో డబుల్ ఎంటర్టైన్మెంట్
నెట్‌ఫ్లిక్స్‌లోకి పెద్ది, సింగ్ గీతం
అదనపు సన్నివేశాలతో ఓటీటీలోకి వచ్చిన రామ్‌చరణ్ ‘పెద్ది’
సింగీతం శ్రీనివాసరావు ఫాంటసీ డ్రామా ‘సింగ్ గీతం’ కూడా స్ట్రీమింగ్‌లోకి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు చిత్రాలు ‘పెద్ది’, ‘సింగ్ గీతం’ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చాయి. విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి.
అదనపు సన్నివేశాలతో ‘పెద్ది’
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. థియేటర్ ప్రదర్శన సమయంలో నిడివి కారణంగా తొలగించిన కొన్ని సన్నివేశాలను తిరిగి జోడించి, విస్తరించిన వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.
ఫాంటసీ ప్రపంచంలోకి ‘సింగ్ గీతం’
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’ ఫాంటసీ మ్యూజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కల్పిత రాజ్యం కుబేరపురం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రూ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా, విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులతో పాటు మరోసారి వీక్షించాలనుకునే సినీ అభిమానులకు ఇది మంచి అవకాశంగా మారింది.
