గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎండీ వరుణ్ రెడ్డి

హనుమకొండ (ఆంధ్రప్రభ): హనుమకొండలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్ఐటీ వరంగల్ అతిథి గృహంలో గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.