రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్య

రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్య


శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా పలాసలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు, ఘటనకు గల కారణాల పై దర్యాప్తు చేపట్టారు. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సమస్యలా..? ఆర్థిక ఇబ్బందులా..? లేదా ఇతర కారణాలా..? అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.