Himanshu Shukla | అప్రమత్తంగానే ఉండాలి..

Himanshu Shukla | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : అధికారులందరూ అప్రమత్తంగానే ఉండాలి అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేసారు. బుధవారం అధికారులతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video conference) లో ఆయన మాట్లాడుతూ.. తుఫాను ముప్పు(Storm threat) తొలగి పోయినట్లు భావించవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల(Inland areas) ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. జాతీయ రహదారి పై నీరు నిలిచిపోయిందని.. నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట, ఆస్తి నష్టం ఎంత జరిగిందో రిపోర్ట్(report) తయారు చేయాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
