చలివేంద్రం ఏర్పాటు

చలివేంద్రం ఏర్పాటు

కుంటాల, ఆంధ్రప్రభ : ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కుంటాల ఎస్సై సి అశోక్ అన్నారు. కుంటాల మండలంలోని ఓలా వాసర సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గజానంద్ గత కొంతకాలంగా వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈసారి చలివేంద్రాన్ని ఎస్సై సి అశోక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చుట్టుపక్కల గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు గజానంద్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వాసర శిశు మందిర్ ఉపాధ్యాయ సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply