బాధితుల‌ను గౌర‌వించాలి..

బాధితుల‌ను గౌర‌వించాలి..

మెద‌క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మెదక్ జిల్లా నార్సింగి(Narsinghi) మండల కేంద్రంలో ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్(Police Station) జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు(Srinivas Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేష‌న్‌లో ఆయన రికార్డులను పరిశీలించారు. పోలీసుల పనితీరును సమీక్షించారు.

స్టేష‌న్‌కు వ‌చ్చిన బాధితులతో గౌరవంగా వ్యవహరించాలని, స‌మ‌స్య‌లు త్వ‌ర‌గా స‌రిష్క‌రించాల‌ని సూచించారు. ఆయన వెంట డీఎస్‌పీ నరేందర్ గౌడ్(DSP Narender Goud), రామయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై సృజన తదితరులు పాల్గొన్నారు.