అర్జీలను సత్వరమే పరిష్కరించాలి..

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి..

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన జి. లక్ష్మీ తాను నాగారం లో కిరాయికి వింటూ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నానని, తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పద్మ ప్రస్తుతం తనకు రేషన్ దుకాణం ద్వారా సాధారణ కోట మాత్రమే లభిస్తుందని ఒంటరి మహిళలకు ప్రభుత్వం నిబంధనలు ప్రకారం నెలకు 35 కిలోల బియ్యం కార్డు కింద మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్కు రాస్తూ విచారణ జరిపి అంత్యోదయ కార్డు అర్హత మేరకు మంజూరు చేయాలన్నారు. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లె గ్రామానికి చెందిన గంధం రాములు గ్రామంలోని హౌస్ నెంబర్ 5-54లో నివాస గృహంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్రహరీ గోడను అక్రమంగా కూల్చేసారని దీనివల్ల 3,50,000 నష్టం జరిగిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణిలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply