గుడుంబా తయారీ స్థావరంపై పోలీసుల దాడి
గుడుంబా తయారీ స్థావరంపై పోలీసుల దాడి
బెజ్జంకి, (ఆంధ్రప్రభ ): మండలంలోని చీలాపూర్ పల్లి పరిసర గ్రామంలో అక్రమంగా గుడుంబా తయారీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో గుడుంబా, తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సుమారు 10 లీటర్ల గుడుంబా, 10 కిలోల బెల్లం, 2 కిలోల పటికతో పాటు తయారీ పరికరాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు హెచ్చరించారు. స్థానిక ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.
