ప్రహరీ గోడను కూల్చివేసిన దుండగులు

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ పట్టణములోని సూర్యాపేట రోడ్డులో ఇంటి స్థలం పై పలుమార్లు దాడులు చేసిన దుండగులపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని బాధితుడు బెలిదె అంజయ్య జిల్లా కలెక్టర్ ను కోరారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు అంజయ్య మాట్లాడుతూ సూర్యాపేట రోడ్డుని పెట్రోల్ వెనుక గల ఇ. నెం. 6-1-ఎస్ 0026 గల స్థల ప్రహరిని కూల్చి వస్తువులు దొంగిలించి ఇప్పటికి పలుమార్లు ఆర్థిక నష్టము కల్గించుటతో పాటు వారి వల్ల ప్రాణభయం ఉందని జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ స్థలంపై గతంలో కోర్టులో కేసు వేయగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఆయన చెప్పారు. కాగా స్థలాన్ని అక్రమంగా అక్రమించుకునేందుకు దుండగులు పలుమార్లు దాడులు చేశారని తనను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇప్పించడంతోపాటు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన కోరారు.
