dark circles | కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు
dark circles | కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు
dark circles | డార్క్ సర్కిల్స్‌కు ప్రధాన కారణాలు
ఆరోగ్య సమస్యల సంకేతమా?
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సింపుల్ హోమ్ టిప్స్
dark circles | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మోడర్న్ లైఫ్ స్టైల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్య, కళ్ల కింద నల్లటి చారలు(డార్క్ సర్కిల్స్). ఇది కేవలం అందం తగ్గించే సమస్య మాత్రమే కాదు… చాలా సందర్భాల్లో మన శరీరం ఇస్తున్న ఏదైనా అనారోగ్య సూచన, లేదా హెచ్చరిక కూడా కావచ్చు.
ముఖంపై, కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా పలుచగా ఉంటుంది. అందుకే అక్కడ మార్పులు త్వరగా కనిపిస్తాయి. అలసట, నిద్రలేమి, ఒత్తిడి… వీటన్నిటి రిఫ్లెక్షన్ ముందుగా కళ్లకిందే బయటపడతాయి. దీనికి ప్రధాన కారణాలు, నిద్ర సరిపోకపోవడం డార్క్ సర్కిల్స్‌కు ప్రధాన కారణం. రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర ఉండకపోతే కళ్ల కింద చర్మం నలుపు రంగులోకి మారుతుంది.

ఇక మొబైల్, ల్యాప్‌టాప్‌ల వినియోగం ఎక్కువ కావడం కూడా ఒక పెద్ద కారణం. ఎక్కువ సేపు స్క్రీన్ ముందు కూర్చుంటే కళ్లపై ఒత్తిడి పెరిగి, కళ్ళచుట్టూ నల్లటి వలయాలు వస్తాయి. ఇవేకాక జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి. కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఈ సమస్య ఉంటే, అదే ఇతరులకు కూడా రావచ్చు. పౌష్టికాహారం లోపం, ముఖ్యంగా ఐరన్, విటమిన్లు తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యను పెంచుతుంది.
అలాగే ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల మార్పులు, డీహైడ్రేషన్ (నీళ్లు తక్కువగా తాగడం) కూడా కళ్ల కింద నల్లటి చారలకు ప్రధాన కారణం. ఇది కేవలం స్కిన్ ప్రాబ్లమ్ మాత్రమే అనుకోవద్దు. చాలా సందర్భాల్లో ఇది చర్మానికి సంబంధించిన సాధారణ సమస్యే. కానీ కొన్ని సందర్భాల్లో ఇది లోపలి ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా కావచ్చు. ఉదాహరణకు అనీమియా (రక్తహీనత), థైరాయిడ్ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కనిపించవచ్చు.

అందుకే సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
తీసుకోవలసిన జాగ్రత్తలు..రోజుకు సరిపడా నిద్ర తప్పనిసరి. ఇది కళ్ల కింద చారలు తగ్గించడంలో మొదటి అడుగు.
రోజంతా సరిపడా నీళ్లు తాగాలి. శరీరంలో నీరు తగ్గితే చర్మం మసకబారుతుంది.

ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. ఐరన్, విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలి.
మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని కాస్త తగ్గించడం మంచిది. మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
కళ్లను బలంగా రుద్దడం మానేయాలి. ఇది చర్మాన్ని మరింత డ్యామేజ్ చేస్తుంది.
సింపుల్ హోమ్ టిప్స్ చల్లని టీ బ్యాగ్స్ లేదా దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచితే ఉపశమనం కలుగుతుంది.
అలోవెరా జెల్ లేదా బాదం నూనెతో కళ్ల చుట్టూ మెల్లగా మసాజ్ చేయడం కూడా ఉపయోగపడుతుంది.

కళ్లకింద నల్లటి చారలు చిన్న సమస్యగా కనిపించినా, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మన లైఫ్ స్టైల్‌కి అద్దం పడినట్టే.
సరైన నిద్ర, మంచి ఆహారం, తక్కువ ఒత్తిడి—ఈ మూడు పాటిస్తే డార్క్ సర్కిల్స్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
అందంగా కనిపించడం కంటే… ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం.
