చిన్నారుల విద్యకు అంగన్వాడీ కేంద్రం తొలి మెట్టు..
రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం నాలుగవ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు రేగొండ ఎస్సై. సుధాకర్ కుర్చీలు బహుకరించారు.రేగొండ మండల కేంద్రంలోని నాలుగవ అంగన్వాడీ పాఠశాలలో ఎస్సై. సుధాకర్ దంపతుల కూతురు విద్యాభ్యాసం చేస్తున్నారు.కాగా అంగన్వాడీ సెంటర్ ను సందర్శించిన ఎస్సై. సుధాకర్ చిన్నారులను చూసి ముచ్చట పడ్డారు.చిన్నారులు కింద కూర్చోవడం చూసి వారికోసం పదిహేను కుర్చీలు బహుకరించారు..ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ..చిన్నారుల విద్యకు అంగన్వాడీ కేంద్రాలు తొలి మెట్టు అన్నారు.ఇంత చిన్న వయసులో సెంటర్ కు వచ్చి చదువుకోవడం సంతోషంగా ఉంది. అని చిన్నారులు దినదినం విద్యలో ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశీర్వదించారు..
అంగన్వాడీ టీచర్ రజిత మాట్లాడుతూ…..
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తుందని దాతలు సహకరిస్తే, మరింత వసతులు చిన్నారులకు ఏర్పడతాయని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న చిన్నారులు నేలపై కూర్చుని అక్షర జ్ఞానం నేరుస్తున్న చిన్నారులకు పదిహేను కుర్చీలు స్థానిక ఎస్ఐ సుధాకర్ బహుకరించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు కుర్చీలపై కూర్చుని చదువుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు దాతలు తమ వంతు సహకారం అంగన్వాడీ కేంద్రాలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో హెల్పెర్ శ్రీలత, మహిళ సంఘం అధ్యక్షురాలు. సుమలత, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
