ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…

ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణ కేంద్రంలో ప్యాక్స్ (PACS) వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ సాధారణ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించడమే ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల ముఖ్య లక్ష్యమని తెలిపారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనౌషధి మందులు తక్కువ ధరలో లభిస్తాయని, ప్రజలు వీటిని వినియోగించాలని సూచించారు..ఈ కేంద్రం ద్వారా అవసరమైన జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటా మని అన్నారు ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్యాక్స్ సభ్యులు, వైద్య సిబ్బంది, పార్టీ నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
