13 Ward l నిన్నే కౌన్సిలర్‌గా గెలిపించుకుంటాం బిడ్డా!

13 Ward l నిన్నే కౌన్సిలర్‌గా గెలిపించుకుంటాం బిడ్డా!

13వ వార్డులో రడపాక ఆరోగ్యం ప్రచార ప్రభంజనం
భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ ఓటర్ల వెల్లడి

13 Ward l స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమ ముగింపు నేపథ్యంలో 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఆరోగ్యం నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి వార్డు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభి స్తోంది. వార్డులోని పలు బస్తీలు, కాలనీల్లో ఆయన తన మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటిం చారు.

ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యం:

వార్డులో ప్రచారాన్ని సోమవారం యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోరెత్తించారు. ఈ సందర్బంగా ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ముచేయబోనని ఆరోగ్యం స్పష్టం చేశారు. 13వ వార్డును పట్టణంలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. వార్డులో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచు కోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికీ స్వచ్ఛ మైన తాగు నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు కలగకుండా వార్డులోని అన్ని వీధుల్లో విద్యు త్ దీపాలు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply