జిల్లా ఉత్తమ సీఎస్‌సీ వీఎల్‌ఈగా ఇస్లావత్ రాజేందర్‌కు అవార్డు
కడెం, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్, భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన 17వ వార్షిక సీఎస్‌సీ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన సీఎస్‌సీ వీఎల్‌ఈ (విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్) ఇస్లావత్ రాజేందర్ 2025–26 సంవత్సరానికి గాను నిర్మల్ జిల్లా ఉత్తమ సీఎస్‌సీ వీఎల్‌ఈగా ద్వితీయ స్థానం సాధించి అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డును సీఎస్‌సీ ఎండీ & సీఈఓ అఖిల్ కుమార్ చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. అవార్డు అందుకున్న ఇస్లావత్ రాజేందర్‌ను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలువురు సీఎస్‌సీ కేంద్రాల నిర్వాహకులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
