గెలుపు బాటలో రజిని

గెలుపు బాటలో రజిని
- 29వ వార్డులో హస్తం జోరు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పట్టణంలోని 29 వార్డులో హస్తం జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇల్లందుల రాజనీ కృష్ణమూర్తి గెలుపు బాటలో పయనిస్తున్నారు. ప్రతిరోజు 29వ వార్డు పరిధిలోని ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బ్యాలెట్ నమూనా అందించి ఈనెల 11న జరిగే పోలింగ్ లో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. గత పదేళ్లుగా మున్సిపల్ పాలకవర్గంలో ఉన్నామని ప్రజల నుండి నయా పైసా తీసుకోలేదని గర్వంగా చెబుతున్నామన్నారు.
మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే 24 గంటల పాటు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో 29వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని అవసరమున్న ప్రతి చోట డ్రైనేజీలు సిసి రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రచారంలో ఇల్లందుల రజనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
