పోలియో రహిత సమాజమే పల్స్ పోలియో లక్ష్యం

పోలియో రహిత సమాజమే పల్స్ పోలియో లక్ష్యం

తోర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజమే పల్స్ పోలియో లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని, తమ 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజంగా చేపట్టిన భారతదేశం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ ఆరోగ్య శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.

పట్టణంలో పలుచోట్ల పల్స్ పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా ప్రాంతంలో వారు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా.జ్వలిత, యం వో మెడికల్ ఆఫీసర్, డా. ప్రియాంక మెడికల్ ఆఫీసర్ డా. స్రవంతి యం ల్ హెచ్ పి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.