Mission Bhagiratha | గెలుపు బాటలో తిరుమల్

Mission Bhagiratha | గెలుపు బాటలో తిరుమల్

  • సింహం గుర్తువైపు ప్రజల మొగ్గు

Mission Bhagiratha | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పట్టణంలోని 13వ వార్డులో సల్వాజి తిరుమల్ గెలుపు దిశగా పయనిస్తున్నారు . వార్డు ప్రజలు సింహం గుర్తు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రచారంలో తిరుమల్ కు బ్రహ్మరథం పట్టారు. అడుగు అడుగున నీరాజనాలు పలికారు. తామంతా సింహం గుర్తుకే ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్లి తిరుమల్ ఓటు అభ్యర్థిగా మెజార్టీ ప్రజలు ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల ఆశీర్వాదంతో తాను మున్సిపల్ పాలకవర్గంలోకి అడుగుపెడుతున్నట్లు తెలియజేశారు. తనను ఆశీర్వదించిన ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వార్డులో అవసరం ఉన్న ప్రతి చోటా సిసి రోడ్లు డ్రైనేజీలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేస్తానన్నారు.

వార్డు పరిధి లో అవసరమున్న చోట మిషన్ భగీరథ పైపు లైన్ వేయించి ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించి వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తా. అధికార, ప్రతిపక్షాల నాయకులను కాదని తనకు మద్దతిస్తున్న వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రచార తీరును గమనిస్తే 13వ వార్డులో తిరుమల గెలుపు ఖాయం అయిపోయినట్లు భావిస్తున్నారు.

Leave a Reply