ట్రాక్టర్ ను ఢీకొన్నఆర్టీసీ బస్సు

ముగ్గురికి తీవ్ర గాయాలు..

బిక్కనూరు మే 4 ఆంధ్రప్రభ.: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు నుండి అదిలాబాద్ వైపు వస్తున్న పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అంతంపల్లి శివారులోకి రాగానే ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొంది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారని సమాచారం. అనంతరం కొంత ట్రాఫిక్ అంతరాయం కావడంతో ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరించారు.