TG | సరస్వతీ పుష్కరాల ట్రాఫిక్‌కి వన్‌వే రూట్..

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: సరస్వతీ పుష్కరాల సమయంలో కాళేశ్వరం ప్రాంతానికి వచ్చే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈరోజు (బుధవారం) కాళేశ్వరం ప్రాంతంలో ఆయన స్వయంగా పర్యటించి, ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించి వాహనాల రాకపోకలకు కొత్త మార్గాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్, వరంగల్ నుంచి ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్, అన్నారం స్తూపం మీదుగా చంద్రుపల్లి, మద్దులపల్లి మీదుగా మీదుగా కాళేశ్వరం చేరుకోవాలనీ, తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మహాదేవపూర్ మీదుగా తమ గమ్య స్థానాలకు వెళ్లాలని తెలిపారు.

కరీంనగర్‌ నుంచి వచ్చే వాహనాలు మంథని, కాటారం, మహదేవ్పూర్ అన్నారం స్తూపం మీదుగా చంద్రుపల్లి, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవాలనీ, తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మహాదేవపూర్ మీదుగా తమ గమ్య స్థానాలకు వెళ్లాలని తెలిపారు.

మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ నుంచి వచ్చే వాహనాలు సిరోంచ, అంతర్ రాష్ట్ర బ్రిడ్జి మీదుగా కాళేశ్వరం చేరుకోవాలి, తిరుగు ప్రయాణంలో అదే రూట్లో సురక్షితంగా చేరుకోవాలనీ అన్నారు.

పుష్కరాలకు వచ్చే వాహనదారులు, పోలీసులకు సహకరించాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు.

Leave a Reply