ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం
*. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
*. సిసి రోడ్లు డ్రైనేజీ లా కల్పనకు ప్రాధాన్యత
*. మున్సిపల్ ను సుందరంగా తీర్చిదిద్దుతా
- రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్, జులై 08 (ఆంధ్రప్రభ): మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాన్ని స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఒకటవ వార్డులో మున్సిపల్ ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ, సుల్తానాబాద్ మున్సిపల్ ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగానే వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణంతో పాటు రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీరాంపూర్ రోడ్డును ఆధునికరించి సెంటర్ లైటింగ్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

రాబోయే నాలుగు నెలల కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వివరించారు. 1,2, 13, 14, 15 వార్డులలో పనులు మొదటి విడతలో శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రజలు విశ్వాసం ఉంచి 15 వార్డులలో 13 వార్డు లు కాంగ్రెస్ అభ్యర్థులను ఘనవిజయంతో గెలిపించడం జరిగిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ టి రమేష్, మహిళా సంఘ సభ్యులు వార్డు ల ప్రజలు పలువురు పాల్గొన్నారు.
మహిళా సంఘ భవన శంకుస్థాపన పూజా కార్యక్రమానికి ఒకటో వార్డు సుగులాంపల్లి కి విచ్చేసిన ప్రభుత్వ విప్ కు యువ నాయకులు సంతోష్ రావు ఆధ్వర్యంలో గజమాల తో ఘనంగా సన్మానించారు.
