హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ హయాంలో మాజీ ఆర్అండ్‌బీ శాఖ మంత్రి చేసిన ఘన కార్యం తమకు తెలుసునని ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 29 వేల కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయని, పదేళ్లలో ఆరు వేల కిలోమీటర్లు రోడ్లు వేశారని తెలిపారు. పదేళ్లలో రూ. 3900 కోట్లు ఆర్ అండ్ బీకి కేటాయించిగా నాలుగు వేల కోట్లు లోన్స్ తీసుకున్నారని అని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి వస్తే చూపిస్తామన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతుంటే బాధ వేస్తోందన్నారు.
మట్టి.. బీటీ లేకుండా కొత్త రోడ్లు నిర్మాణం
మట్టి, బీటీ, లేకుండా కొత్త రోడ్ల నిర్మాణం ఉంటుందని, వచ్చే డిసెంబర్ నాటికి రోడ్లు అంటే ఇలా ఉండాలని ప్రజలకు అర్థం అయ్యేలా నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు వేస్తే 50శాతం తెలంగాణ కవర్ అవుతుంది. తాము పనిచేస్తామని, బీఆర్ఎస్ నేతల్లాగా మాట్లాడలేమని అన్నారు. పీవీ నరసింహారావు ప్లై ఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇచ్చాం అంటే తాము రెడీ చేశామంటున్నారు. మరి అంతా రెడీ చేసి సర్టిఫికెట్ లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బంగారు తెలంగాణ అంటూ నాశనం చేశారు
బంగారు తెలంగాణ అని అంతా నాశనం చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీపీపీ మోడల్ లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు లేవు, హ్యామ్ అనేది ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం చేసి 100 శాతం నిధులు ప్రభుత్వమే చెల్లించే మోడల్ అని వివరించారు. 2008 లోరాజీవ్ రహదారి (శామీర్ పేట్-రామగుండం), మరియు నార్కట్ పల్లి-అద్దంకి, మేదరమెట్ల రోడ్డును పీపీపీ మోడల్ లో నిర్మించామన్నారు. ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నామన్నారు. హ్యామ్ మోడల్ ను 2016 ఎన్‌హెచ్ఏఐ ప్రారంభించిందన్నారు. దీన్ని ఎనిమిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 ఫేజులు పూర్తయి, 3వ ఫేజ్ నడుస్తుందన్నారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, కేరళ కూడా హ్యామ్ ను అమలు చేస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వ లోన్ కూడా తామే కడుతున్నాం…
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జీహెచ్ఎంసీలో రోడ్లు నిర్మించేందుకు సేమ్ హెచ్ఏఎం మోడల్ లాంటి సీఆర్ెంపీ (కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రం) లో రోడ్లను నిర్మించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రూ. 8,112 కోట్లతో 10 ఏండ్లలో 6668 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే రిపేర్లు చేపట్టగలిగిందన్నారు. దీని కోసం 3945 కోట్లు (స్టేట్ బడ్జెట్ లో) + 4167 కోట్ల రూపాయలు ఆర్‌డీసీ ద్వారా లోన్ తీసుకొని రోడ్లను నిర్మించారు. ఆ లోన్ కూడా తమ ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. తాము రూపాయి లోన్ తీసుకోకుండా రోడ్లను నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే నాలుగు వేల కోట్ల రూపాయల మంజూరీ లు ఇవ్వడం జరిగింది.
మీరు పదేళ్లలో నిర్మించిన రోడ్లను ఏడాదిలోనే చేస్తున్నాం…
మీరు అంటే బీఆర్ఎస్ పదేండ్లలో నిర్మించిన రోడ్లను తాము ఏడాది కాలంలోనే చేస్తున్నామని, సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) తీసుకురావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తామ వచ్చిన తర్వాత రూ.850 కోట్ల ను సీఆర్ఐఎఫ్ కింద తీసుకొచ్చానట్లు చెప్పారు. దీంతో, దీంతో 435 కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. మీకు బిల్డింగ్ ల మీద ఉన్న శ్రద్ధ రోడ్ల మీద లేక ప్రస్తుతం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మీరు ఎమ్మెల్యేలకు, బిల్డింగులు కట్టడం తప్ప మీరు ప్రజలకు అవసరమైన రోడ్లను మత్రమే నిర్మించలేదన్నారు. మామా అల్లుడు, కొడుక్కి దేవుడు ఇచ్చిన వరం అటాక్ చేయడమని ఎద్దేవా చేశారు.
రోడ్లు ఉంటేనే ప్రజల ప్రాణాలకు సేఫ్
రోడ్లు మంచిగా ఉంటేనే ప్రజల ప్రాణాలు సేఫ్, కానీ అలాంటి రోడ్ల నిర్మాణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. రోడ్ల నిర్మాణాలను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. 2017 లో ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ కు గెజిట్ వచ్చిన గత ప్రభుత్వం నిర్మించలేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కొరకు డిప్యూటీ సీఎం 1525 కోట్లు నిధులు ఇచ్చారని చెప్పారు. 18 నెలల్లో ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పూర్తి చేస్తున్నామన్నారు. ప్రశాంత్ రెడ్డి నల్గొండ కు 200 కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చినట్లు చెబుతున్నరాని, రూ. 200 కోట్ల రోడ్లు నల్గొండ లో నిర్మాణం చేస్తే ప్రశాంత్ రెడ్డి కి సన్మానం చేస్తా…కొబ్బరి కాయ కొడ్తా అని అన్నారు. ఆనాడు, ప్రశ్నించినందుకు.. హౌజ్ లకెళ్లి తనను, సంపత్ ని డిస్ క్వాలిఫై చేశారని గుర్తు చేశారు.
దండం పెడతా.. అబద్దాలు ఆడొద్దు
దండం పెడ్తా .. అబద్దాలు ఆడొద్దని, ఒకవేళ లెక్కలు ఉంటే చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు. హ్యోమ్ లో యేడాదికి రెండు లేదా మూడు ఫేజ్ లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్టేట్ లో వరెస్టు రోడ్స్ అంటే అది గత ప్రభుత్వ హాయంలోనే ఉన్న రోడ్లు అని విమర్శించారు. యాదగిరి గుట్ట కట్టినా అంటారు.. రూ. 340 కోట్లు బకాయిలు ఉన్నాయని, రోజు వచ్చి బకాయి పైసల్ తనను అడుగుతున్నారన్నారు. 15 నెలల్లో 15 బ్రిడ్జిలు, 2వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశామని చెప్పారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఫోర్ క్లోజ్ చేస్తే పనులు ఆలస్యం అయితయని గడ్కరీ ని రిక్వెస్ట్ చేశా.. అనేక కష్టాలు పడ్డా.. ఇవ్వాల పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. తాను ఒక పార్లమెంట్ సభ్యుడి గా తనకున్న పరిచయం తో పనులు చేయించానని చెప్పారు. ప్రశాంత్ రెడ్డి పనులు సెక్రెటరియేట్ కట్టాలి, ప్రగతి భవన్, ఫామ్ హోజ్ లో చండీ యాగాలు ,యోగాలు యజ్ఞనాలు చెయ్యాల్నయే..
ప్రభుత్వానికి క్లారిటీ లేదు : హరీశ్‌రావు
సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలని, ప్రభుత్వానికి క్లారిటీ లేదని, కొత్త ప్రతిపాదనలు లేవని మంత్రి అంటున్నారని, అలాంటప్పుడు బడ్జెట్ పుస్తకంలో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 60 శాతం ప్రభుత్వమని భట్టి విక్రమార్క అంటే.. ప్రైవేట్ అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబల్ రోడ్డులు వేశామన్నారు.
సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్..
మంత్రి కోమటిరెడ్డి సమాధానాన్ని నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఇతర విషయాలు ప్రస్తావించారని బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. బీఆర్ఎఎస్ హయాంలో చేసిన రోడ్ల గణాంకాలు స్పీకర్ సమక్షంలో పెట్టాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ సమక్షంలో పెట్టాలని డిమాండ్ చేసినా స్పందించలేదని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.