RBI Injuction : 1.5 లక్షల కోట్ల లిక్విడిటీ

RBI Injuction : 1.5 లక్షల కోట్ల లిక్విడిటీ
ఇటు ముందస్తు పన్ను
అటు జీఎస్టీ చెల్లింపు
బ్యాంకుల్లో నగదు కొరతనివారణకు ఆర్బీఐ ఇంజక్షన్
ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్

భారత దేశంలో నగదు కొరత (Cash Shortage) నివారణ చర్యల్లో ఆర్బీఐ బిజీబిజీగా ఉంది. ఈ రోజు కీలక చర్యలు చేపట్టింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నగదును (Liquidity) పంపిణీ చేయడానికి ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో నగదు కొరతను నివారణే కాదు,
ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి సుమారు ₹1.5 లక్షల కోట్ల వరకు లిక్విడిటీని ఇంజెక్ట్ (Liquilidy Injuction) చేస్తోంది. డిసెంబర్ 15న ముందస్తు పన్ను (Advance Tax) గడువు, డిసెంబర్ 20న జీఎస్టీ (GST) చెల్లింపుల వల్ల బ్యాంకుల నుంచి భారీగా నగదు బయటకు వెళ్తుంది. దీనివల్ల ఏర్పడే నగదు కొరతను అధిగమించడానికి ఓవర్ నైట్ వడ్డీ రేట్లను (WACR) స్థిరంగా ఉంచడానికి ఆర్‌బీఐ ఈ ‘లిక్విడిటీ ఇంజెక్షన్’ చేస్తోంది.
ఆర్‌బీఐ ఈ రోజు (డిసెంబర్ 18) ₹50,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ సెక్యూరిటీలను (బాండ్లను) బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తోంది. ఫలితంగా ఆ నగదు బ్యాంకులకు చేరుతుంది.డిసెంబర్ 16 న నిర్వహించిన కరెన్సీ స్వాప్ ఆక్షన్ లో $5 బిలియన్ల (సుమారు ₹45,000 కోట్లు) ‘బై సేల్’ స్వాప్ వేలం సెటిల్మెంట్ నేడు (డిసెంబర్ 18) జరుగుతోంది. డాలర్లను కొనుగోలు చేసి, బదులుగా రూపాయిలను మార్కెట్లోకి ఆర్‌బీఐ విడుదల చేస్తుంది.
ముందస్తు పన్ను చెల్లింపులు, జీఎస్టీ (GST) చెల్లింపులతో మార్కెట్‌లో తాత్కాలిక నగదు కొరతను తగ్గించడానికి ఆర్‌బీఐ అదనంగా ₹1.5 లక్షల కోట్ల వరకు నిధులను వేరియబుల్ రేపో రేటు (VRR) వేలం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థకు అందుబాటులోకి తెచ్చింది.
