నల్గొండ జిల్లా మరో పటాన్ చెరువుగా మార్చొద్దు
నల్గొండ జిల్లా మరో పటాన్ చెరువుగా మార్చొద్దు
-నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చిట్యాల , ఆంధ్రప్రభ: చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని నోస్ ఫార్మా ల్యాబ్‌లో ఇటీవల జరిగిన ప్రమాద ఘటనపై సీపీఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి నారాయణ ప్రమాద స్థలాన్ని సందర్శించి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాలకృష్ణ కుటుంబానికి వెంటనే రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నోస్ ఫార్మా ల్యాబ్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గత 20 రోజుల వ్యవధిలోనే ఇదే సంస్థలో రెండోసారి ప్రమాదం జరగడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
కార్మికుల దినోత్సవం రోజున కూడా కార్మికులతో పనులు చేయించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ కార్మికుల ప్రాణాలు కోల్పోయిన యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదని తీవ్రంగా విమర్శించారు. లాభాల కోసం కార్మికుల ప్రాణాలను లెక్క చేయని పరిస్థితి నెలకొన్నదనిపేర్కొన్నారు. ఈ ధర్నాలో , సీపీఐ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా మరో పటాన్ చెరువుగా మార్చొద్దు
