డిజిటల్ టెక్నాలజీ బోధన సద్వినియోగం చేసుకోవాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రపంచం వేగంగా డిజిటల్ దిశగా ముందుకు సాగుతోందని, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బోధన మరింత సులభంగా, ఆసక్తికరంగా మారుతోందని , ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల గ్రామ సర్పంచి తౌటం లక్ష్మి- అంతయ్య కోరారు .ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో , ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి- అంతయ్య , పాల్గొని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచం వేగంగా డిజిటల్ దిశగా ముందుకు సాగుతోంది. విద్యా వ్యవస్థ కూడా కాలానుగుణంగా మారాలి. పాతకాలంలో బ్లాక్‌బోర్డు పుస్తకాలతోనే బోధన జరిగే దన్నారు. కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ద్వారా బోధన మరింత సులభంగా, ఆసక్తికరంగా మారుతోందని , ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు,

అలాగే ఈ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు , కళాశాల బృందానికి అభినందలు తెలియజేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ డిజిటల్ క్లాస్‌రూమ్ వల్ల విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుంది. వారు పాఠాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందే అవకాశం కలుగుతుంద న్నారు. ప్రభుత్వ కళాశాలలలో విద్యార్థులను చేర్పించడానికి ఆసక్తి చూపాలని కోరారు. అనంతరం 2025 -2026 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల జాబితా పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ లక్ష్మి ని ప్రిన్సిపాల్, అధ్యాపకులు, శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, 4 వ వార్డ్ మెంబర్ తౌటం నవీన్ , సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply