కాంగ్రెస్ అసమర్ధత వల్లే నిలిచిన ఫామాయిల్ ఫ్యాక్టరీ

కాంగ్రెస్ అసమర్ధత వల్లే నిలిచిన ఫామాయిల్ ఫ్యాక్టరీ
–మాజీ మంత్రి ఎర్రబెల్లి కృషితోనే ఫ్యాక్టరీ మంజూరు
తొర్రూరు, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే తొర్రూరులో ఫామాయిల్ ఫ్యాక్టరీ పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ లు ఆరోపించారు. గురువారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో తొర్రూరు ప్రాంతానికి పామాయిల్ ఫ్యాక్టరీ మంజూరు చేయించాడని, ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం హరిపిరాల, గోపాలగిరి శివారు దళిత, గిరిజన, బీసీ రైతుల నుండి 90 ఎకరాలు సేకరించారని, రూ.250 కోట్లు ఫ్యాక్టరీకి మంజూరు చేయించారని గుర్తు చేశారు.
దాంతోపాటు రూ.1.50 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో హరిపిరాల శివారు కోటిలింగాల గుడి నుండి చర్లపాలెం వరకు బీటీ రోడ్డు, నర్సరీలో ఐదు బ్లాక్ లకు సీసీ రోడ్డు అప్పటి మంత్రి దయాకర్ రావు వేయించారని గుర్తు చేశారు. హరిపిరాలలో అతిపెద్ద నర్సరీ దయాకర్ రావు హయాంలో ఏర్పాటు చేశారని, దాని మూలంగా వివిధ ప్రాంతాల్లోని రైతులు తొర్రూరు నర్సరీ కి వచ్చి 5.30 లక్షల మొక్కలు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
దయాకర్ రావు దూరదృష్టి వల్ల 9 ఎకరాల్లో పంట సాగవుతుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి అసమర్ధత వల్ల పామాయిల్ ఫ్యాక్టరీ పనులు నిలిచిపోయాయని తెలిపారు. తాజాగా ఆయిల్ ఫామ్ పంట సాగుపై హరిపిరాల నర్సరీలో అవగాహన సదస్సు నిర్వహించారని, అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లేకుండా కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని ఎమ్మెల్యే స్థానంలో ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు.
దయాకర్ రావు పామాయిల్ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించకుండా ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.ఏనాడు ఫామ్ ఆయిల్ రైతుల పక్షాన మాట్లాడని జంగా పామాయిల్ రైతుల కోసం ఎంతో కృషి చేసిన దయాకర్ రావు పై విమర్శలు చేయడం సరికాదన్నారు.నర్మెట్ట,తొర్రూరుకు పామాయిల్ ఫ్యాక్టరీలు ఒకేసారి మంజూరయ్యాయని, నర్మెటలో ఫ్యాక్టరీ ప్రారంభించి తొర్రూరులో పనులు నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు.
తొర్రూరు ఫ్యాక్టరీ నిలిచిపోవడానికి జంగా రాఘవరెడ్డి కమిషన్ల కక్కుర్తి కారణమన్నారు.తక్షణమే తొర్రూరు పామాయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని,లేనిపక్షంలో ప్రతిపక్షంగా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, కౌన్సిలర్లు తూర్పాటి రవి, పేర్ల జంపన్న, మాడుగుల భవాని లత, నాయకులు కాలు నాయక్, ఎస్.కె అంకుష్, రాయిశెట్టి వెంకన్న, ధారావత్ జై సింగ్, ఈనెపల్లి శీను, మాచర్ల వెంకన్న, లకావత్ యాకుబ్, బాబురావు, పులి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
