ఆలయ నిర్మాణానికి విరాళం

ఆలయ నిర్మాణానికి విరాళం
వెల్దండ, ఆంధ్రప్రభ : నూతన ఆలయ నిర్మాణానికి భారీ విరాళాన్ని అందజేసినట్టు ఆలయ నిర్వాహన కమిటీ సభ్యులు తెలిపారు. వెల్దండ మండల సమీపంలోని చెరుకూరు గ్రామంలో నూతంగా నిర్మిస్తున్న శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి కీర్తిశేషులు దగ్గుబాటి ప్రసాద్ రావు కుమారులు.. బాలకిషన్ రావు, రమణరావు, ప్రవీణ్ కుమార్ లు వారి జ్ఞాపకార్థంగా 2 లక్షల 50 వేల రూపాయాలు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకి అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శశిధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
