నారా లోకేష్ కు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుభాకాంక్షలు

నారా లోకేష్ కు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుభాకాంక్షలు
అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గాబాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్ కి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుభాకాంక్షలుతెలిపారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ ని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన లోకేష్ కిఅభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లా డుతూనారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
యువ నాయకత్వం ద్వారా పార్టీకి నూతన ఉత్సాహం వచ్చి, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలలో ఉత్తేజం పెరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పార్టీ కార్యవర్గానికి కూడా అభినందనలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా సమస్యలపరిష్కారంలో కార్యవర్గం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పార్టీమరింతశక్తివంతంగా ముందుకు సాగుతుందని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
