అన్నదానం సమాజం ట్రస్ట్..

అన్నదానం సమాజం ట్రస్ట్..

భూములపై అక్రమాలపై..
విజిలెన్స్‌ విచారణ చేయాలి.
దేవాదాయ శాఖకు ఫిర్యాదు

ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : అన్నదానం సమాజం ట్రస్ట్ భూములపై అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేయాలని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొండా ఉమా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో బొండా ఉమా మాట్లాడుతూ 146.68 ఎకరాల విలువైన భూములపై ఆక్రమణలు, రూ.100 కోట్ల ఆస్తిపై అనధికార లావాదేవీలు, సేవా లక్ష్యాలకు విఘాతం, 1967లో సేవా దృక్పథంతో కేటాయించిన భూములు, సమగ్ర సర్వే, డిమార్కేషన్‌కు డిమాండ్, అక్రమాలపై కఠిన చట్టపరమైన చర్యలు అవసరంమని ఆయన పేర్కొన్నారు. ట్రస్ట్ భూములు తిరిగి స్వాధీనం చేయాలని ఆయన కోరారు.విజయవాడలోని అన్నదానం సమాజం ట్రస్ట్‌కు చెందిన విలువైన భూములపై జరుగుతున్న అక్రమాల అంశాన్ని,కైకలూరు ప్రాంతంలో విస్తరించి ఉన్న సుమారు 146.68 ఎకరాల ట్రస్ట్ భూములు గత కొన్నేళ్లుగా అక్రమ ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు, అక్రమ లావాదేవీలకు గురవుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ భూముల విలువ రూ.100 కోట్లకు పైగా ఉండటంతో, ఈ అక్రమాల తీవ్రత మరింత పెరిగినట్లు పేర్కొన్నారు.

Leave a Reply