సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అంద చేత

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అంద చేత
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పాతబస్తీ 46 వ డివిజన్ కు చెందిన కట్టా రమ్య కృష్ణ కు రెండు రోజుల క్రితం చిన్నారి జన్మించినది.. ఆ చిన్నారికి అనారోగ్య కారణంగా ఎన్ ఐ సీ యూ లో చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. వైద్యానికి 7,05,000/- రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు.. చిన్నారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు.దీనికి సంబంధించిన ఎల్వోసీ ను బుధవారం చిన్నారి కుటుంబ సభ్యులకు అంద చేశారు.. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బుద్ద వారి గుడి చైర్మన్ పిల్లా సుదర్శన్ రావు. ఆలయ ధర్మకర్త ఉప్పూడి రాము, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.
