ఆర్జీయూకేటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతం..
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; తెలంగాణలోని బాసర, మహబూబ్నగర్, ఆర్జీయుకేటి యూనివర్సిటీ కి 2026 27 సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో ప్రశాంతంగా కొనసాగుతుంది. త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు విసి గోవర్ధన్ రాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో సీట్లు పొందిన విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబరిచి యూనివర్సిటీకి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం అకాడమిక్ బ్లాక్లో యూనివర్సిటీ అధికారులు అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించారు. యూనివర్సిటీ బిసి గోవర్ధన్ ఓ ఎస్ డి మురళీధర్షన్ ఇతర అధికారులు మొదటి అడ్మిషన్ పత్రాలను విద్యార్థినికి అందజేశారు. శనివారం సోమవారం అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
